భానుడి ప్రతాపంతో తెలుగు రాష్ట్రాలలో భారీగా ఉష్ణోగ్రత ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.ఈ నెల 31 నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. జూన్ 1, 2 తేదీల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు రాగల రెండు రోజులు పొడి వాతావరణం ఉంటుందని.. రేపు పగటి ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని వెల్లడించింది.
కాగా, సూర్యుడి వేడికి దేశంలోని ఉత్తర భారతం భగభగ మండుతోంది. ముఖ్యంగా దేశ రాజధాని న్యూ ఢిల్లీ ఎండ వేడికి ఉడుకుతోంది. భారత వాతావరణ శాఖ ప్రకారం..దేశ రాజధానిలో ఉష్ణోగ్రతలు బుధవారం రికార్డు స్థాయిలో దాదాపు 52.3 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగాయి అని తెలిపింది.