Meter: కిరణ్ అబ్బవరం”మీటర్”నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్

-

ఈరోజు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన కొత్త ప్రాజెక్టుల నుంచి అప్డేట్స్ వస్తున్నాయి. వైవిధ్యమైన కథలతో, తన బాడీ లాంగ్వేజ్ కి తగిన సినిమాలను ఎంచుకుంటూ వెళ్తున్నారు కిరణ్ అబ్బవరం. ఇటీవల విడుదలైన ‘సమ్మతమే’ సినిమాతో మళ్లీ మంచి హిట్ తన ఖాతాలో వేసుకుని మరికొన్ని సినిమాల లైనప్ తో సిద్ధంగా ఉన్నాడు.

అయితే నేడు తన పుట్టిన రోజు సందర్భంగా మైత్రి మూవీస్ వారు తమ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమాకి సంబంధించిన టైటిల్ పోస్టర్ ని వదిలారు. ఈ సినిమాకి ‘మీటర్’ అనే టైటిల్ ను సెట్ చేసినట్లుగా చెబుతూ.. కిరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఇది పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న చిత్రంగా అర్థమవుతుంది. ఈ సినిమాకి రమేష్ కాడూరి దర్శకత్వం వహించగా.. సాయి కార్తీక్ సంగీతాన్ని సమకూర్చాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version