రూ.999కే షియోమీ ఎంఐ బియ‌ర్డ్ ట్రిమ్మ‌ర్‌..!

-

ఎంఐ బియ‌ర్డ్ ట్రిమ్మ‌ర్ 1సి పేరిట షియోమీ ఓ నూత‌న ట్రిమ్మ‌ర్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. గ‌తేడాది విడుద‌ల చేసిన ఎంఐ బియ‌ర్డ్ ట్రిమ్మ‌ర్ క‌న్నా ఇది త‌క్కువ ధ‌ర‌ను క‌లిగి ఉండ‌డం విశేషం. కొత్త ట్రిమ్మ‌ర్‌ను క్వాడ్ ఎడ్జ్ డిజైన్‌తో రూపొందించారు. దీని వ‌ల్ల బ్లేడ్లు అత్యంత క‌చ్చితత్వంలో వెంట్రుక‌ల‌ను క‌ట్ చేస్తాయి. ఇందులో 20 ర‌కాల లెంగ్త్ సెట్టింగ్స్‌ను ఏర్పాటు చేశారు. ఒక్క‌సారి ఈ ట్రిమ్మ‌ర్‌ను ఫుల్ చార్జింగ్ చేస్తే.. 60 నిమిషాల పాటు ఉప‌యోగించుకోవ‌చ్చు.

0.5 ఎంఎం లెంగ్త్‌తో వెంట్రుక‌ల‌ను ట్రిమ్ చేసుకునే విధంగా ఈ ట్రిమ్మ‌ర్‌లో స‌దుపాయం క‌ల్పించారు. 1 గ‌డ్డం దువ్వెనను దీంతో ఇస్తారు. ట్రిమ్మ‌ర్ అన‌వ‌స‌రంగా ఆన్ కాకుండా ఉండేందుకు గాను ఇందులో ట్రావెల్ లాక్ స‌దుపాయాన్ని ఏర్పాటు చేశారు. ట్రిమ్మ‌ర్‌పై ఉండే ఎల్ఈడీ లైట్ అందులో ఇంకా బ్యాట‌రీ స్థాయి ఎంత ఉందో తెలియజేస్తుంది. ఈ ట్రిమ్మ‌ర్‌ను మైక్రో యూఎస్‌బీ పోర్టు ద్వారా చార్జింగ్ చేసుకోవ‌చ్చు. ల్యాప్‌టాప్ లేదా ప‌వ‌ర్ బ్యాంక్ ద్వారా కూడా ఈ ట్రిమ్మ‌ర్‌ను చార్జ్ చేయ‌వ‌చ్చు.

ఈ ట్రిమ్మ‌ర్‌లో 600 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఏర్పాటు చేశారు. 2 గంట‌ల పాటు దీన్ని చార్జింగ్ పెడితే సుమారుగా 60 నిమిషాల పాటు ఉపయోగించుకోవ‌చ్చు. ఎంఐ బియ‌ర్డ్ ట్రిమ్మ‌ర్ 1సి ధ‌ర రూ.999గా ఉంది. దీన్ని ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌ల‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version