టిడిపి అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు. దమ్ముంటే చంద్రబాబు సహా టిడిపి ఎమ్మెల్యేలు అందరు రాజీనామాలు చేసి గెలవాలని అన్నారు. అయితే 48 గంటల తరువాత భూమి బద్దలవుతుందని చెప్పి తోక ముడిచి హైదరాబాద్ కి పారిపోయాడంటూ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు.
అంతేకాకుండా అమరావతి రాజధాని ప్రజా ఆమోదయోగ్యమనుకుంటే రాజీనామా చేసి పోటీ చేసి గెలవాలన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు జూమ్ లో డ్యాన్స్ లు, సోషల్ మీడియాలో ఫైట్ లు చేస్తున్నాడంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తన కొడుకు లోకేష్ ను సిఎం చేయాలని కలలు కన్నాడని ఆమె అన్నారు. అప్పుడే చంద్రబాబు ఓటమికి బీజం పడిందని ఆమె పేర్కొన్నారు. కొవిడ్ పేషంట్లకు అందుతున్న వైద్య సేవలపై సోషల్ మీడియాలో సందేశాలు పంపడం కాదు.. ధైర్యముంటే కరోనా బాధితుల దగ్గరకెళ్లి పరిశీలించి వారికీ సేవలు అందించాలని రోజా చంద్రబాబుకు సవాల్ విసురుతూ మాట్లాడారు.