IPL MI vs PBKS : ముంబైకి తప్పని నిరాశ… పంజాబ్ చేతిలో ఓటమి

-

ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ కి ఐపీఎల్ 2020 సీజన్లో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఇప్పటికే వరుసగా నాలుగు మ్యాచ్ లో ముంబై… తాజాగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లోనూ ఓడింది. దీంతో వరుసగా 5 ఓడింది. పంజాబ్ విధించిన 199 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ (28), ఇషాన్ కిషన్ (3) రాణించలేకపోయారు. మొదటి నాలుగు ఓవర్లోనే ఓపెనర్లు పెవిలియన్ బాట పట్టారు. జూనియర్ ఏబీ గా పేరు ఉన్న బ్రేవీస్ (25 బంతుల్లో 49) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

అలాగే తిలక్ వర్మ (36), సూర్యకుమార్ యాదవ్ (40) తమ బ్యాట్లను ఝులిపించారు. కానీ తర్వాత వచ్చిన పొలార్డ్ తో పాటు బ్యాట్స్ మ్యాన్లు రాణించలేకపోయారు. దీంతో ముంబై… ముంబై పై 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీనికి ముందు పంజాబ్ ఇన్నింగ్స్ లో.. మయాంక్ అగర్వాల్ (52) శిఖర్ ధావన్ (70) హాఫ్ సెంచరీలతో దుమ్ము లేపారు. ఈ మ్యాచ లో హాఫ్ సెంచరీ చేసిన కెప్టెన్ మయాంక్ అగర్వాల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version