IPL PBKS vs MI : హాఫ్ సెంచ‌రీల‌తో రాణించిన పంజాబ్ ఓపెన‌ర్లు.. ముంబై టార్గెట్ 199

-

ఐపీఎల్ 2022లో భాగంగా ఈ రోజు ముంబై ఇండియ‌న్స్, పంజాబ్ కింగ్స్ మ‌ధ్య పోరు జ‌రుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ముంబై బౌలింగ్ ఎంచుకోగా.. పంజాబ్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. పంజాబ్ ఇన్నింగ్స్ లో ఓపెన‌ర్లు మ‌యాంక్ అగ‌ర్వాల్ (52), శిఖ‌ర్ ధావ‌న్ (70) రాణించారు. వీరు తొలి వికెట్ కు 97 ప‌రుగుల భారీ భాగ‌స్వామ్యాన్ని నెలకోల్పోరు. వీరి త‌ర్వాత వ‌చ్చిన జానీ జెయిర్ స్టో (12), లియాన్ లివింగ్ స్టన్ (2) వ‌రుస‌గా విఫ‌లం అయ్యారు.

షారుక్ ఖాన్ (15) చివ‌ర్లో జీతేశ్ శ‌ర్మ (15 బంతుల్లో 30 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై బౌల‌ర్లు… బ‌సిల్ థంపి 2 వికెట్లు తీశాడు. బుమ్రా, ఉన‌ద్క‌ట్, మురుగ‌న్ అశ్విన్, తలో వికెట్ తీసుకున్నారు. దీంతో పంజాబ్ నిర్ణ‌త 20 ఓవ‌ర్ల‌లో ప‌రుగులు చేసింది. కాగ ముంబై ఇండియ‌న్స్ విజ‌యం సాధించాలంటే.. ప‌రుగులు చేయాల్సి ఉంటుంది. ఈ టార్గెట్ ను ఛేదించి.. ఐపీఎల్ లో బోణి కొడుతుందో చూడాలి. ఇప్ప‌టికే నాలుగు మ్యాచ్ లు ఓడిన ముంబై.. ఈ మ్యాచ్ లో విజ‌యం సాధించాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version