మ‌ళ్లీ వివాదాల పుట్ట‌ను గెలికిన మైకేల్ వాన్‌.. ప‌రోక్షంగా ఇండియ‌న్ క్రికెట్ టీమ్‌పై విమ‌ర్శ‌లు..

-

ఇంగ్లండ్ క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ మైకేల్ వాన్‌  Michael Vaughan ఎప్పుడూ వివాదాల్లోనే ఉంటాడు. గ‌తంలో ఎన్నో సార్లు భార‌త జ‌ట్టుపై విమర్శ‌లు గుప్పించాడు. వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఫ్యాన్స్ ఎప్పుడూ అత‌నికి సోషల్ మీడియా ద్వారా బుద్ది చెబుతూనే ఉంటారు. అయిన‌ప్ప‌టికీ వాన్ త‌న తీరును మార్చుకోవ‌డం లేదు. తాజాగా మ‌రోమారు అత‌ను వివాదాల పుట్ట‌ను గెలికాడు.

మైకేల్ వాన్‌ /Michael Vaughan

ఇంగ్లండ్ మ‌హిళా క్రికెట్ జ‌ట్టుతో భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టు ప్ర‌స్తుతం అక్క‌డ వ‌న్డే సిరీస్‌ను ఆడుతున్న సంగ‌తి తెలిసిందే. ఆ సిరీస్‌ను ఇంగ్లండ్ ఇప్ప‌టికే 2-0 తేడాతో కైవ‌సం చేసుకుంది. అయితే రెండో మ్యాచ్‌లో భార‌త్ ఓట‌మి అనంత‌రం మైకేల్ వాన్ ట్వీట్ చేశాడు. ఇంగ్లిష్ గ‌డ్డ‌పై కేవ‌లం ఒక ఇండియ‌న్ టీమ్ మాత్ర‌మే ఆడ‌గ‌లుగుతుంద‌ని భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టును మెచ్చుకున్నాడు. అంటే ప‌రోక్షంగా మెన్స్ జ‌ట్టును విమ‌ర్శించాడ‌న్న‌మాట‌.

ఇటీవ‌ల న్యూజిలాండ్‌తో జ‌రిగిన వ‌ర‌ల్డ్ టెస్టు చాంపియ‌న్ షిప్ ఫైన‌ల్‌లో భార‌త్ ఓట‌మి పాలైంది. దీంతో వాన్ భార‌త్‌పై ఆ విధంగా విమ‌ర్శ‌లు చేశాడు. భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టు ఓడిపోయినా పోరాట ప‌టిమ‌ను చూపించింద‌ని అన్నాడు. అయితే వాన్‌కు ఇది కొత్తేమీ కాదు. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ ముందు అత‌ను న్యూజిలాండ్ త‌న ఫేవ‌రెట్ అని కామెంట్ చేశాడు. దీంతో భార‌త ఫ్యాన్స్ మండిప‌డ్డారు. అయితే న్యూజిలాండ్ గెలిచాక తాను చెప్పిందే నిజ‌మైంద‌ని, భార‌త ఫ్యాన్స్ త‌న‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని అన్నాడు. ఇక తాజాగా పై విధంగా కామెంట్లు చేశాడు. దీంతో మరోసారి ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version