ముందస్తు ప్రకటనలు ఏవీ లేకుండా అప్పటికప్పుడు కరో్నా లాక్ డౌన్ కారణంగా ప్రతి మనిషీ బాధ పడ్డాడు. వలస కూలీలు పడిన కష్టాల గురించి వింటేనే వణుకు వస్తోంది. ఇక అందరూ చనిపోవడమే అన్న ప్రచారాల నేపధ్యంలో అదేదో సొంత మనుషుల వద్ద చనిపోదామని చాలా మంది తమ స్వస్థాలకు చేరుకోవడానికి వందలాది కిలో మీటర్లు కాలినడకన నడుచుకుంటూ వెళ్లారు. మరి కొందరు ఎలా అయినా తమ స్వస్థలానికి వెళ్ళాలని కూడా వందల కిలో మీటర్లు నడుచుకుంటూ వెళ్లారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది.
కరోనా కేసులు భారీగానే నమోదవుతున్నా జన జీవనం మాత్రం మళ్ళీ మామూలుగా మొదలయిపోయింది. దీంతో అప్పుడు వెళ్ళిపోయిన వలస కూలీలను వెనక్కు రప్పించుకునే పనిలో పడ్డారు వారి యజమానులు. లాక్డౌన్ సమయంలో తమ స్వస్థలాలకు వెళ్లిన వలస కార్మికులు ఇప్పుడు విమానాల్లో తితిగి వస్తున్నారు. తమ రాష్ట్రాల నుండి వెనక్కు రావడానికి రైలు టిక్కెట్లు అందుబాటులో లేవని వారు విమానాలలో తిరిగి వస్తున్నారు. “నా యజమాని నా టికెట్ బుక్ చేశాడు, ఇది నా మొదటి విమాన ప్రయాణం” అని వలస కూలీ సతీష్ సోని చెప్పారు. ఈయనే కాదు ఇలాంటి వాళ్ళు చాలా మందిని యజమానులు ఫ్లైట్ టికెట్ లు బుక్ చేసి వెనక్కు రప్పించుకుంటున్నారు.
Gujarat: Migrant labourers who went back to their native places during the lockdown are returning to Surat on flights, citing unavailability of train tickets from their States.
Satish Soni, a migrant labourer says, “My employer booked my ticket. It’s my 1st flight journey.” pic.twitter.com/vB26TOV2eR
— ANI (@ANI) September 29, 2020