చావుపుట్టుకలు మన చేతుల్లో లేవు అనుకుంటారు. కానీ అవి పక్కా ప్లానింగ్‌తోనే జరుగుతాయి..మనిషి పుట్టుక వెనుక ఎంతో పెద్ద కథ ఉంటుంది. ఆ పైవాడు అన్నీ చూసుకుని లెక్కలేసుకోని కిందకు దింపుతాడు.. ఈ కాలంలో కూడా ఇదంతా ఏంటి అని కొంతమంది అనుకుంటారు.. మీరు పుట్టిన గడియలను బట్టి మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో జాతకం చెప్తుంది.. దానికి సైన్స్‌తో కూడా సంబంధం ఉంది. తెలుసుకోవడం మీ బాధ్యత.. రాత్రి పుట్టిన వారి గురించి కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు మీకోసం..!
తెలివి తేటల విషయంలో ఎవరు ఎలా ఉన్నా రాత్రిపూట పుట్టిన వారు మాత్రం ఇతర సమయాల్లో పుట్టిన వారి కంటే సహజంగానే ఎక్కువ తెలివితేటలు కలిగి ఉంటారట. పలువురు పిల్లలపై శాస్త్రవేత్తలు జరిపిన ఈ పరిశోధనల్లో ఈ విషయం తెలిసింది.. పిల్లల పుట్టిన సమయం, వారి చదువు, జ్ఞానం వంటి అంశాలను పరిశీలించారు. అలా పిల్లలపై జరిపిన పరిశోధన ద్వారా వారు ఈ విషయాన్ని గుర్తించారు..రోజులో ఇతర సమయాల్లో పుట్టిన వారి కంటే రాత్రి పూట పుట్టిన వారే జ్ఞానవంతులుగా ఉంటారట. వారికే ఐక్యూ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి.
తెలివితేటలు ఎక్కువే..
రాత్రి పూట పుట్టిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉండడంతో పాటు సమస్యలను పరిష్కరించే సామర్థ్యం కూడా ఎక్కువగా ఉంటుందట. వీరు అన్ని రంగాల్లో రాణించగలరు..గొప్ప ఉద్యోగాల్లో ఉంటారట. సాధారణంగా ఎవరికైనా రోజుకు 7 నుండి 8 గంటల నిద్ర అవసరం…కానీ వీరికి 5 నుండి 6 గంటల నిద్ర ఉండే సరిపోతుందట. రాత్రి పూట పుట్టిన వారికి ఎక్కువ నిద్ర అవసరం ఉండదట. అన్నీ పనుల్లో వీరు చురుకుగా ఉంటారట.
రోగాలు కూడా ఎక్కువే..
తెలివి ఎక్కువగా ఉండే వారిలో మానసిక రుగ్మతులు, ఆందోళన, ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే సాధారణ తెలివి ఉన్న వ్యక్తుల్లో కంటే ఎక్కువ తెలివితేటలు ఉన్న వ్యక్తుల్లో ఆరోగ్య సమస్యలు 10 శాతం ఎక్కువగా ఉంటాయని వీరి పరిశోధనల్లో తేలింది. వీటితో పాటు 500 మంది పిల్లల మీద వీరు సుదీర్ఘ కాలం పాటు చేసిన అధ్యయనం చేస్తే.. 200 కంటే ఎక్కువ మంది చిన్నారులు మామూలు కంటే ఎక్కువ తెలివి తేటలు కలిగి ఉన్నారు.అంతేకాదు వీరిలో చాలా మందికి 18 నుండి 20 సంవత్సరాల వయసు వచ్చే సరికి ఒత్తిడి, ఆందోళన వంటి వాటి బారిన పడడమే కాకుండా మరికొన్ని మానసిక రుగ్మతల బారిన కూడా పడ్డారని పరిశోధకులు గుర్తించారు. అయితే సాధారణ తెలివి తేటలు ఉన్న వారిలో మాత్రం ఈ సమస్యలను వారు గుర్తించలేదు.
మొత్తానికి ఎక్కువ తెలివితేటలు ఉంటే.. ఎక్కువ సమస్యలే.. అది అధ్యయనం ద్వారానే కాదు.. సాధారణంగా కూడా చెప్పేయొచ్చేమో కదా.. మనిషి ప్రశాంతంగా బతకాలంటే.. ఎక్కువ విషయాల్లో తలదూర్చకూడదు.. ఎన్ని విషయాల్లో మన ప్రమేయం ఉంటుంది.. అంత పీస్ ఆఫ్ మైండ్‌ను మనం కోల్పోతూ ఉంటాం.. అలా అని మొద్దులా కూడా ఉండొద్దు.. నీ పరిధిలో నువ్వు ఉంటే చాలు అంటున్నారు నిపుణులు.