మళ్ళీ అధికారంలోకి రావాలని జగన్ కష్టపడుతున్న విషయం తెలిసిందే. ఈ సారి కూడా అధికారంలోకి వస్తే మరొక 30 ఏళ్ల పాటు తానే సిఎం గా ఉంటాననే కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. అయితే అధికారం కోసం జగన్ మళ్ళీ కష్టపడుతున్నారు గాని..మరి అధికారంలోకి వచ్చే పరిస్తితి ఉందా? అంటే ఇప్పటికైతే ఉంది..ఎన్నికలనాటికి ఏం అవుతుందో చెప్పలేని పరిస్తితి. ఎందుకంటే ప్రజల్లో జగన్ పరంగా ఎలాంటి వ్యతిరేకత లేదు.
పథకాల పేరిట పేద ప్రజలకు ఆయన డబ్బులు అందిస్తున్నారు. ఎలా అయిన ఇవ్వని ఎకౌంట్లలో డబ్బులు వేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. దీంతో జగన్ పట్ల ప్రజలు పాజిటివ్ గానే ఉన్నారు. కానీ అసలు చిక్కల్లా వైసీపీ ఎమ్మెల్యేలతోనే..ఎందుకంటే ఎమ్మెల్యేలు గెలిస్తేనే కదా..జగన్ మళ్ళీ సిఎం అయ్యేది. అయితే జగన్ పై పాజిటివ్ ఉంటే కొంతమేర ఓట్లు పడతాయి. ఎమ్మెల్యేలపై కూడా పాజిటివ్ ఉంటే ఫుల్ గా ఓట్లు పడతాయి..అప్పుడు వైసీపీ గెలిచి అధికారంలోకి రావడం సాధ్యమవుతుంది.
కానీ ఎమ్మెల్యేల విషయం నెగిటివ్ ఎక్కువ ఉంది. సగానికి సగం ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. ఎమ్మెల్యేలు ప్రజల్లో ఎక్కువ ఉండకపోవడం..గడపగడపకు ఉన్న ఏదో మొక్కుబడిగా చేయడం..లేదా వైసీపీకి అనుకూలంగా ఉండేవారి ఇళ్లకు ప్లాన్ చేసుకుని వెళ్ళడం, అటు నియోజకవర్గాల్లో అక్రమాలు పెరుగుతున్నాయనే ఆరోపణలు ఎక్కువ రావడం ఎమ్మెల్యేలకు బాగా మైనస్ అవుతుంది.
అన్నిటికీమించి నియోజకవర్గాల్లో చిన్న చిన్న సమస్యలని సైతం పరిష్కరించడంలో ఎమ్మెల్యేలు విఫలమవుతున్నారని, రోడ్లు, త్రాగునీరు , డ్రైనేజ్ లాంటి చిన్న అభివృద్ధి కార్యక్రమాలని చేయట్లేదనే విమర్శలు వస్తున్నాయి. అసలు కొందరు ఎమ్మెల్యేలు ఏమో ఎక్కువ వివాదాల్లో ఉంటున్నారు. ఈ పరిస్తితులని బట్టి చూస్తే కొందరు ఎమ్మెల్యేలే వైసీపీని ముంచుతారా అనే పరిస్తితి. అయితే పరిస్తితి ఎలా ఉన్న జగన్ ఇమేజ్ పై ఆధారపడి గెలవాల్సిందే..ఇక గెలుపు భారం జగన్ పైనే ఉంది.