అందరూ ఇది వరకు త్వరగా పెళ్లిళ్లు చేసుకునేవారు. పెళ్లి వయసు వచ్చాక పెళ్లి చేసుకుని స్థిరపడి పోయేవారు. అదే ఇప్పుడు చూస్తే పెళ్లిళ్లు ఆలస్యంగా అవుతున్నాయి. తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమంటున్నా పిల్లలు ఇంకా వద్దని అప్పుడే కాదని లేకపోతే సెటిల్ అవ్వాలని ఇలా ఏవో ఒక కారణమే చెప్తున్నారు. నిజానికి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పెళ్లి ఆలస్యంగా చేసుకోవడం వలన లైఫ్ లో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
30 తర్వాత పెళ్లి చేసుకుంటే కొన్ని రకాల సమస్యలు తప్పవు. మరి 30 తర్వాత పెళ్లి చేసుకుంటే ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సంగతి ఇప్పుడు చూద్దాం. ఇదివరకు పెద్దవాళ్ళకి కూడా ఓపిక ఎక్కువ ఉండేది కానీ ఈ మధ్యకాలంలో పెద్ద అయ్యే కొద్ది ఓపిక తగ్గిపోతూ వస్తోంది. 30 తర్వాత పెళ్లి చేసుకుంటే ఓపిక తో ఉండడం కాస్త కష్టం ఓపిక లేకపోతే పిల్లల్ని కనడం పిల్లల్ని పెంచడం కష్టమవుతుంది. అందుకనే త్వరగా పెళ్లి చేసుకోవడం మంచిది.
తక్కువ వయసులో పెళ్లి చేసుకుంటే పిల్లల్ని కనడంలో బాధ ఉండదు 28 ఏళ్ల కంటే ముందే పిల్లల్ని ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. వయసు పెరిగే కొద్దీ ఆడవాళ్ళ హార్మోన్లలో మార్పు వస్తూ ఉంటుంది. కాబట్టి పెళ్లి విషయం లో మహిళలు అస్సలు ఆలస్యం చేయకూడదు. 25, 30 ఏళ్లు దాటుతుంటే ఈ మధ్య రకరకాల సమస్యలు వస్తున్నాయి. 40 ఏళ్లు దాటుతుంటే మెనోపాజ్ మొదలు అవుతుంది. ఇవన్నీ రాకుండానే పెళ్లి చేసుకోవడం మంచిది. మీ పిల్లలు పెళ్లి వయసుకు వచ్చేసరికి మీరు వృద్ధులైపోతారు. మీ అవసరం కూడా మీ పిల్లలకి ఉందని గుర్తుపెట్టుకోండి.