తెలంగాణలో దారుణం.. మైనర్‌ బాలికపై బాత్రూంలో లైంగిక దాడి

-

దేశంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. ప్రతి రోజు ఏదో ఓ మూలన… మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్ని కఠినమైన నిర్నయాలు, చట్టాలు అమలు చేసినా.. ముర్ఖులకు బుద్ది రావడం లేదు. ఇంకా రెచ్చి పోయే ప్రవర్తి స్తున్నారు. అయితే తాజాగా నిర్మల్ జిల్లా కేంద్రంలో ఓ మైనర్ బాలికపై ఓ కామాంధుడు లైంగికదాడికి పాల్పడ్డాడు.

ఈ ఘటన వివరాల్లోకి వెళితే… నిర్మల్ జిల్లా మామడ మండలం లోని ఓ గ్రామంలో… మైనర్ బాలిక ఈనెల ఆరో తేదీన రాత్రి సమయంలో… బాత్రూం కి వెళ్ళింది. అయితే దీనిని గమనించిన అదే గ్రామానికి చెందిన 26 ఏళ్ల యువకుడు.. లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె బాత్ రూం లోకి వెళ్లగానే.. ఇతడు దౌర్జన్యంగా వెళ్లి లైంగికదాడికి ఒడిగట్టాడు. ఈ విషయం తెలిసిన ఆమె తల్లిదండ్రులు నేరుగా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన.. పోలీసులు… పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆ యువకుడు పోలీసుల అదుపులోనే ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version