తెలంగాణతో సహ అన్నీ రాష్ట్రాలు ఇంటర్, పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏపీలో మాత్రం ఈ పరీక్షలను ఎటు తేల్చలేకపోతున్నాయి. దీంతో అటు విద్యార్థులు, వారి పేరెంట్స్ లో కలవరం నెలకొంది. పరీక్షలు ఉంటాయా లేకా రద్దు అవుతాయా అనే గందరగోళం ఉంది. ఈ నేపథ్యంలో ఇంటర్, పదో తరగతి పరీక్షలపై మరోసారి క్లారిటీ ఇచ్చారు ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఏపీలో కరోనా కేసులు తగ్గుతున్నాయని.. ఈ నేపథ్యంలో ఇంటర్, పదో తరగతి పరీక్షలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
జులై మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు ఉండవచ్చని… అలాగే జూలై నెలాఖరులో పదో తరగతి పరీక్షలను పెట్టేందుకు పరిశీలిస్తున్నామని ఆయన వెల్లడించారు. అయితే ఈ పరీక్షలపై గురువారం సీఎం జగన్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు. పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆయన పేర్కొన్నారు.