పోలవరంపై మంత్రి అంబటి సంచ లన వ్యాఖ్య లు చేశారు. ఇవాళ పోలవరంలో మంత్రి అంబటి రాంబాబు పర్యటించి… మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ తొందర పాటుతో ప్రాజెక్ట్ కి తీవ్ర నష్టం ఏర్పడిందని.. నిపుణుల బృందాలు ప్రాజెక్ట్ పనులను పూర్తి స్థాయిలో పరిశీలించారని వివరించారు.
గత ఏడాది వచ్చిన వరదల కారణంగా డయాఫ్రమ్ వాల్ బాగా దెబ్బతింది.. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతంలో పెద్దపెద్ద అగాధా ఏర్పడ్డాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో గత వరదల్లో 485 మీటర్ల మేర డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని చెప్పారు.
NHPC, DDRP, PPA బృందాలు అన్ని విధాలుగా పరిశీలన చేసి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న ప్రాంతాలను గుర్తించారని మంత్రి అంబటి రాంబాబు వివరించారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టి మిగతా పనుల్లో ముందుకు వెళ్లవచ్చని సూచనలు చేశారు.. త్వరలోనే డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను చేపడతామని ప్రకటించారు మంత్రి అంబటి రాంబాబు.