కాళహస్తి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు హోం మంత్రి అనిత. అనంతరం ఆవిడ మాట్లాడుతూ.. సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తున్నాము. అందుకే కాళహస్తీ ఆలయంలో 50 రూపాయల టికెట్టు రద్దు చేసాం. సామాన్య భక్తులకు ఉచిత దర్శనం రెండు క్యూలైన్ ల ద్వారా ఏర్పాటు చేసాం. 200 రూపాయల విఐపి టికెట్టు ధరను 250 రూపాయలకు పెంచాం. స్వామి, అమ్మ వారి అంతరాలయ దర్శనం టిక్కెట్టు ధర 500 రూపాయలు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం అందిస్తాం. మహిళలకు పసుపు కుంకుమ గాజులు రవిక అమ్మవారి ప్రసాదంగా ఇస్తాం.
ఉత్సవాల్లో క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు మంచి నీరు బాటిల్స్, బిస్కెట్స్ , మజ్జిగ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాము. భక్తులకు 11 పార్కింగ్ పాయింట్లు.. ప్రతి పార్కింగ్ పాయింట్ లో అంబులెన్స్ ఉంటుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సీసీ కెమెరాల ద్వారా పోలిసుల పర్యవేక్షణ ఉంటుంది. విఐపిలకు ప్రత్యేక టైం స్లాట్ ఏర్పాటుతో దర్శనం కల్పిస్తాం అని మంత్రి పేర్కొన్నారు.