ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ప్రాణాంతక తొక్కిసలాటకు.. రెండు రైళ్ళ పేర్లు “ప్రయాగ్ రాజ్” అని ఒకే రకంగా ఉండడమే కారణమని ఢిల్లీ పోలీసులు తెలిపారు. రైల్వే ద్విసభ్య కమిటీ ప్రాధమిక నివేదిక లో కూడా దాదపు అదే అభిప్రాయం వ్యక్తం చేసింది. “ప్రయాగ్ రాజ్ స్పెషల్” ఒక రైలు పేరు, రెండవ రైలు పేరు ప్రయాగ్ రాజ్ ఎక్స్ ప్రైస్. 16వ నెంబర్ రైల్వే ప్లాట్ ఫామ్ కు “ప్రయాగ్ రాజ్ స్పెషల్” రైలు వస్తోందని వచ్చిన ప్రకటనే మొత్తం గందరగోళానికి దారితీసింది. ప్రయాగ్ రాజ్ ఎక్స్ ప్రైస్ అప్పటికే 14 వ నెంబర్ రైల్వే ప్లాట్ పై ఉంది.
ప్రయాగ్ రాజ్ ఎక్స్ ప్రెస్ రైలు కోసం ఇంకా 14 వ నెంబర్ రైల్వే ప్లాట్ ఫామ్ కు రాలేకపోయిన ప్రయాణికులు, రైల్వే ప్రకటనవిని.. 16 వ నెంబర్ ప్లాట్ ఫామ్ కు రైలు వస్తోందని పొరపడ్డారు. దాంతో ఒక్కసారిగా ప్రయాణికులు, పిల్లలు, భారీ లగేజీ బ్సాగ్ లతో రావడంతో తొక్కిసలాట జరిగింది. అదనంగా ప్రయాగ్ రాజ్ వెళ్ళే మరో నాలుగు రైళ్లల్లో మూడు రైళ్లు ఆలస్యమయ్యాయు. ప్రయాగ్ రాజ్ వెళ్లే ఈ రైళ్ళన్నీ ఆలస్యం కావడంతో, 12 నుంచి 16 వ ప్లాట్ ఫామ్ ల్లో ప్రయాణికులు సంఖ్య అంతకంతకూ బాగా పెరిగి పోయింది. 14 నుంచి 15 వ ప్లాట్ ఫామ్ మధ్య వంతెన పై వెళ్తున్న ప్రయాణికుల్లో ఒక ప్రయాణికుడు పడిపోవడంతో, వెనకున్న ప్రయాణికులు వరుసగా ఒకరిపై ఒకరు పడిపోవడంతో.. తొక్కిసలాట జరిగి ఊపిరాడక 18 మంది మృతి చెందారు. పెద్ద సంఖ్య లో గాయాలపాలయ్యారు అని తెలిపారు పోలీసులు.