హెల్త్ కార్డుల తయారీపై మంత్రి దామోదర కీలక ఆదేశాలు

-

తెలంగాణలో హెల్త్ ప్రొఫైల్, హెల్త్ కార్డుల్లోని సమాచారం ప్రజలకు సకాలంలో వైద్యం అందించేందుకు సాయపడేలా ఉండాలని అధికారులను మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. మొదట వ్యక్తుల పేరు, అడ్రస్, వృతి వంటి ప్రాథమిక సమాచారం సేకరించాలని, ఆ తర్వాత ఆరోగ్య సమస్యలు, అనారోగ్య కారక అలవాట్లు వంటివి నమోదు చేయాలన్నారు. యూనిక్ నంబర్, బార్ కోడ్, ఫొటోతో హెల్త్ కార్డులను తయారు చేయాలని సూచించారు.

అయితే, తెలంగాణలో హెల్త్ కార్డులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డులతో సంబంధం లేకుండా ప్రజలు అందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.తొలుత వివరాలు సేకరించి ఆ తర్వాత వేగంగా హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, హెల్త్ కార్డులు లేక చాలా మంది పేదలకు ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం అందడం లేదని ఇటీవల పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే కుటుంబ ఆదాయం, రేషన్ కార్డులను ప్రమాణికంగా తీసుకోకుండా హెల్త్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version