డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ.. వారికి 7నెలల తర్వాత జీతాలు!

-

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న ఆయన ఆపదలో ఉన్నామని తమను ఆదుకోవాలని వచ్చిన వారిని చేరదీస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు ఏ సమస్య వచ్చినా.. తన దృష్టికి వచ్చిన వాటిని వెంటనే పరిష్కరిస్తున్నారు. సినిమాల్లోనే కాకుండా పాలనలోనూ తన మార్క్ చూపిస్తున్నారు. పవన్ పాలన చూసి జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా పవన్ కళ్యాణ్ చొరవతో కార్మికులు 7 నెలల తర్వాత జీతం అందుకున్నారు.ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సత్యసాయి తాగునీటి సరఫరా పథకం కింద పనిచేసే 536 మంది కార్మికులు 7 నెలల జీతాలు చెల్లించాలని రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారు.ఈ విషయం పవన్ దృష్టికి రావడంతో రూ.30కోట్ల నిధులు విడుదల చేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను ఆదేశించారు. దీంతో డిప్యూటీ సీఎంకు కార్మికులు ధన్యవాదాలు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version