ఏపీ అసైన్డ్ భూములపై రెవెన్యు మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక ప్రకటన చేశారు. రెవెన్యూ శాఖలో సంస్కరణలపై చర్చించేందుకు, ప్రభుత్వ విధానాలను క్లియర్ గా చెప్పేందుకు రీజినల్ సదస్సు నిర్వహిస్తామని..అసైన్డ్ భూములపై త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. అసైన్డ్ భూములకు సంబంధించిన 77యాక్ట్ కు సవరణలను ప్రతిపాదిస్తాం…..22(ఏ)భూములపై సర్వే త్వరితగతిన జరుగుతోందని వెల్లడించారు.
సమస్యలను పరిష్కరించే అధికారం కలెక్టర్లకు ఇచ్చామని..ఆటో మ్యూటేషన్ విధానం ద్వారా సింగిల్ విండో రిజిస్ట్రేషన్ పద్ధతి అని పేర్కొన్నారు. భూములపై సమగ్రమైన వివరాలు సేకరించిన తర్వాతే ఇకపై రిజిస్ట్రేషన్ లు జరుగుతాయని..భూమి విలువ పెరగడం ద్వారా సర్వతోముఖాభివృద్ధికి కారణంగా మారిందన్నారు.
వివిధ కారణాలతో వివాదాస్పదంగా మిగిలిపోయిన భూములను వినియోగంలోకి తీసుకుని రావాలనేది సీఎం ఆలోచన అన్నారు. సర్వే విభాగంలో ఉద్యోగాల భర్తీ ద్వారా బలోపేతం చేసాం….చుక్కల భూములు సహా హక్కులు కల్పించకుండా వుండి పోయిన సమస్యలు పరిష్కరించే ప్రక్రియ జరుగుతోందని తెలిపారు రెవెన్యు మంత్రి ధర్మాన ప్రసాదరావు.