ప్రభుత్వం ఉంటే ఉండనీ..పోతే పోనీ అంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న రాత్రి శ్రీకాకుళం జిల్లాలో మీడియాతో మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడారు. సూత్రా పౌండేషన్ వార్షికోత్సవం లో పాల్గొన్న మంత్రి ప్రసాదరావు…అనంతరం మాట్లాడారు. నమ్ముకున్న ప్రజల అవసరాలు , అవకాశాలు నిలబెట్టలేని ఎమ్మెల్యే ఉద్యోగం – మంత్రి ఉద్యోగం దేనికి అని ప్రశ్నించారు.
గవర్నమెంట్స్ ఉంటే ఉండనీ పోతే పోనే కానీ మన అవకాశాలను జారవిడిచికొడానికి భాద్యతలేకుండా ఉండకూడదని హాట్ కామెంట్స్ చేశారు. తాను రాజదానికి కట్టుబడి ఉన్నానని ముఖ్యమంత్రి జగన్ చెప్పారని… ప్రభుత్వం మీవెనుక ఉంటుంది , మంత్రిగా ఉండి పొరాడాలని చెప్పారని తెలిపారు. నేను ఎవరి కీ బయపడను , నేను చేయాల్సిన పని చేస్తూ ఉంటాను… చంద్రబాబు క్యాపిటల్ సిటీలో జరిగిన మోసంపై అసెంబ్లీ లో అడిగిత మాటాడలేకపోయారని ఆగ్రహించారు. ఆస్తి దోచుకున్న దొంగలకు అస్సలు బయపడనని…రాజధాని వద్దని ఉత్తరాంధ్ర లను హేలన చేస్తున్నారని నిప్పులు చెరిగారు.