కడియం శ్రీహరి ఇంట్లో లంచ్.. కేసీఆర్ టూర్ షెడ్యూల్ ఇదే..!

-

హైదరాబాద్: సీఎం కేసీఆర్ మూడు రోజుల పాటు జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. అభివృద్ధి పనులను ఆయన క్షేత స్థాయిలో పరిశీలించనున్నారు. ఈ నెల 20, 21, 22వ తేదీల్లో సిద్దిపేట, కామారెడ్డి, యాదాద్రి, భువనగిరి, వరంగల్, వాసాలమర్రిలో సీఎం పర్యటించనున్నారు.

జూన్ 21న సీఎం కేసీఆర్ వరంగల్‌లో పర్యటించనున్న నేపథ్యంలో తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ క్లారిటీ ఇచ్చారు. ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ టూర్ వివరాలు వెల్లడించారు. 21న ఉదయం 10 గంటల 30 నిమిషాలకు సెంట్రల్ జైలు స్థలంలో సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి భూమి పూజ చేస్తారని ఎర్రబెల్లి తెలిపారు. అనంతరం కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ, నూతన కలెక్టరేట్‌కు ప్రారంభోత్సవం చేస్తారని చెప్పారు. అనంతరం కడియం శ్రీహరి ఇంట్లో లంచ్ చేస్తారని పేర్కొన్నారు. ఆ తర్వాత యాదాద్రికి బయలుదేరుతారని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా సస్యశ్యామలం కావడం వెనక ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఉందన్నారు. కరోనా సమయంలోనూ ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేశామని చెప్పారు. కరోనా సమయంలో కేంద్రం విఫలమైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవచూపి మెరుగైన వైద్యం అందించిందని వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ విషయంలోనూ కేంద్రం నిర్లక్ష్యం చేసిందని ఎర్రబెల్లి ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

కాగా 20న సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో, 21న వరంగల్‌, భువనగిరి జిల్లాల్లో, 22న భువనగిరి జిల్లాలో సీఎం పర్యటించనున్నారు. సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో నూతన కలెక్టరేట్‌ భవనాలతోపాటు అత్యాధునిక హంగులతో నిర్మించిన సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌, కామారెడ్డి జిల్లా పోలీస్‌ అధికారి (డీపీవో) కార్యాలయ భవనాలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అలాగే సీఎం దత్తత గ్రామం తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామాన్ని సందర్శించనున్నారు

 

Read more RELATED
Recommended to you

Exit mobile version