సినిమాలను థియేటర్ లోనే చూడండి: మంత్రి ఎర్రబెల్లి

-

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ రోజు తొర్రూరు లో కొత్త థియేటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, సినిమాల గురించి మరియు ఒక సినిమా మొత్తం రెడీ అయ్యి థియేటర్ లలో రిలీజ్ చేయాలంటే ఎంత ఖర్చుతో కూడుకున్నది చక్కగా వివరించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఒక నిర్మాత ఆస్తులను సైతం తాకట్టులు పెట్టి సినిమాలను నిర్మిస్తారు.. అలాంటిది మీరు వారు పడే కష్టాన్ని గౌరవించి సినిమాను ఖచ్చితంగా థియేటర్ లోనే వీక్షించాలని చెప్పారు. సినిమాను థియేటర్ లో చూస్తే వచ్చే ఆనందమే వేరంటూ చెప్పుకొచ్చారు మంత్రి.. కేసీఆర్ సీఎంగా అయిన తర్వాత సినీ పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా చెప్పారు. అనంతరం ఎర్రబెల్లి కాసేపు థియేటర్ లో సినిమాను వీక్షించారు.

ఇక నేటికాలంలో సినిమా రిలీజ్ కాకముందే ఒరిజినల్ ప్రింట్ లు ఆన్లైన్ లో విడుదల కావడం మనము చూస్తూనే ఉన్నాము.

Read more RELATED
Recommended to you

Latest news