మునుగోడులో పోటీ చేయనున్న రాజగోపాల్ రెడ్డి సతీమణి ?

-

తెలంగాణ ఎన్నికలు మరో నెల రోజుల్లో జరగనున్నాయి. అధికారంలో ఉన్న కేసీఆర్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ లు అధికారం కోసం పాకులాడుతున్నాయి. ఇప్పటికే సీట్ల సర్దుబాటు కేటాయింపులు దాదాపుగా పూర్తి అయిపోయినట్లే. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మునుగోడు నియోజకవర్గంలో ప్రస్తుతం బీజేపీలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి పోటీ చేయనున్నారన్న వార్త పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఈ విషయంపై ఇంకా ఎటువంటి స్పష్టత రాలేదు, కాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బీజేపీ ప్రకటించిన మొదటి జాబితాలో సీటు కేటాయించకపోవడంతో ఆయన కొంచెం అసంతృప్తిలో ఉన్నారట. ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి అనువైన స్థానంలో సీటు ఇవ్వకపోతే తిరిగి సొంత గూటికి వెళ్లి ఎల్బీ నగర్ సీటును ఆశించే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది.

మరి రాజగోపాల్ రెడ్డికి అనుకూలంగా జరుగుతుందా లేదా రెండు పార్టీలలో సీట్లు దక్కకుండా మిగిలిపోతారా అన్నది తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news