కేంద్రంపై మరోసారి మంత్రి ఎర్రబెల్లి ఫైర్‌

-

మరోసారి తెలంగాణ గ్రామాలు అత్యుత్తమంగా నిలిచాయి. దేశానికి ఆదర్శంగా మారాయి. తెలంగాణ పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అని నిరూపించాయి. కేంద్రం ప్రకటించిన మొత్తం 46 జాతీయ అవార్డుల్లో 13 అవార్డులు తెలంగాణ రాష్ట్రం గెలుచుకుంది. 8 దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు, మరో 5 నానాజీ దేశ్ ముఖ్ సర్వోత్తమ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు తెలంగాణ రాష్ట్రం సగౌరవంగా అందుకుంది.

తెలంగాణ పల్లెల ముఖచిత్రం మారడంలో మిషన్ భగీరథ కీలక భూమిక పోషించిందని, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం నీతి ఆయోగ్ సిఫారసులకు అనుగుణంగా నిధులు ఇవ్వడంలో మాత్రం విఫలమైందన్నారు. చివరకు గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల విడుదలకు సైతం కోత పెట్టిందని, రైతు కల్లాలకు నిధుల్ని వినియోగించడాన్ని తప్పుపట్టిందన్నారు. అవార్డులు ఇస్తూనే నిధులను తగ్గించడం సమంజసం కాదన్నారు. హైదరాబాద్ మెట్రో రైలులో సాంకేతిక లోపంగ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధాని,చాలని దీర్ఘకాలంగా విజ్ఞప్తి చేస్తున్నామని, కానీ కేంద్రం సానుకూలంగా స్పందించలేదన్నారు. సాగునీటి సౌకర్యాలు పెరగడంతో రాష్ట్రంలో పంట విస్తీర్ణం కూడా పెరిగిందని, కూలీలు దొరకక రైతులు ఇబ్బంది పడుతున్నారని గుర్తుచేశారు. మెటీరియల్ కాంపొనెంట్ కింద రూ. 907 కోట్లను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఉపాధి హామీ కూలీలకు ఆన్‌లైన్ ద్వారా అటెండెన్స్ విధానాన్ని తీసుకురావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కూలీలను అవమనపరచడమే అని అన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version