తెలంగాణాలో ఎన్నికల వేడి రాజుకుంటోంది, అధికార BRS మాత్రం మళ్ళీ గెలిచేది మేమే అంటూ చాలా ధీమాగా ఉంది. ఇక విజయం దక్కుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న పార్టీలలో బీజేపీ మరియు కాంగ్రెస్ లు ఉన్నాయి. ఇక తాజాగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ .. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ఈయన మాట్లాడుతూ , రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికలలో కనీసం అభ్యర్థులను కూడా నిలబెట్టడానికి బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలకు కరువుగా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. దరఖాస్తులను రౌడీ షీటర్ లు మరియు దొంగలకు అమ్ముకుంటూ అభ్యర్థులను నిలబెడుతోందని కమలాకర్ కఠినమైన వ్యాఖ్యలు చేశారు గంగుల కమలాకర్. ముందస్తుగా అభ్యర్థులను నిలబెట్టడంతో ప్రతిపక్షాలకు భయపడుతున్నాయని కామెంట్ చేశారు కమలాకర్. రేవంత్ రెడ్డి మరియు బండి సంజయ్ లకు దమ్ముంటే ఒకేసారి 50 మంది అభ్యర్థులను నిలబెట్టండి అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు మంత్రి గంగుల కమలాకర్.
ఒకేసారి 50 మంది అభ్యర్థులను ప్రకటించే దమ్ము సంజయ్ , రేవంత్ లకు ఉందా ?
-