ఈ చెట్టు గాలి పీల్చితే అలర్జీ.. పాలు తాగితే ప్రాణాలు పోవాల్సిందే..!

-

చెట్ల కింద కుర్చున్నా, నుల్చున్నా మనసుకు హాయిగా ఉంటుంది. ఆ చల్లటి గాలి తాకుతుంటే మస్త్‌ అనిపిస్తుంది. అందుకే ప్రతి ఇంట్లో ఏదో ఒక చెట్టు కచ్చితంగా ఉండాలంటారు. కానీ ఇప్పుడు చెప్పుకునే చెట్లు గురించి తెలిస్తే మీ మైండ్‌ బ్లాక్‌ అవుతుంది. మనుషుల్లో కూడా క్రూరత్వం ఉన్నవాళ్లు ఉన్నట్లు.. ఈ చెట్లు కూడా యమడేంజర్‌. వీటి గాలి పీల్చినా ప్రమాదమే.. ఈ చెట్ల కింద నుల్చుంటే ప్రాణాలు పైకే. అంత డెంజరెస్‌ చెట్లు ఇవి..!

ఎన్నో అధ్యయనాలు చేసిన తర్వాతే శాస్త్రవేత్తలే చెబుతున్నారు.

ఈ చెట్టు పేరు ‘మంచినీల్’. ఇది చూసేందుకు అచ్చం యాపిల్‌ చెట్టులానే ఉంటుంది. ఆకులు కూడా ఆపిల్ చెట్టు ఆకులానే ఉంటాయి. ఎక్కువగా ఇది సముద్రపు ఒడ్డున మాంగ్రూవ్ చెట్ల మధ్యలో పెరుగుతుంది. అందుకే దీన్ని బీచ్ ఆపిల్ చెట్టు అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు పాలలాంటి ద్రవాన్ని స్రవిస్తుంది. ఆ ద్రవం చర్మానికి అంటితే చాలా ప్రమాదకరం. అది చర్మానికి అంటిన తర్వాత లోపలి వరకు ఇంకిపోతుంది. అప్పుడు చర్మంపై దద్దుర్లు, కురుపులు వస్తాయి. ఎలర్జీలు తీవ్రంగా మారుతాయి. వెంటనే వైద్య సహాయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది.

అంతేకాదు ఈ చెట్టుకింద ఓ అరగంట పాటు నిలుచుంటే ఆరోగ్యం క్రమంగా పాడవుతుంది. ఒళ్ళు దురదలు పెడుతుంది. ఏదో తెలియని వికారం మొదలవుతుంది. ఈ చెట్టు ఆకుల మీద పడిన వర్షపు నీళ్లు మన చర్మం మీద పడినా కూడా ప్రమాదమే. వెంటనే ఎలర్జీ వచ్చేస్తుంది. చర్మం ఎర్రగా మారి దద్దుర్లు వస్తుంది. రక్తం కారుతుంది. నొప్పి విపరీతంగా పెడుతుంది. చివరికి ఆ చెట్టుని తగలబెట్టాలని చూసినా కూడా ఆరోగ్యానికి ఎంతో హాని జరుగుతుంది.

ఆ చెట్టును తగలబడితే వచ్చే పొగ వల్ల కంటి చూపు మందగించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. అదృష్టవశాత్తూ ఈ చెట్లు మనదేశంలో కనిపించవు. అయితే మనం విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు ఊకే చెట్టు బాగుంది కదా అని ఇలాంటి చెట్ల కింద నిలబడి ఫోటోలు దిగితే అంతే.. దక్షిణ, ఉత్తర అమెరికా ప్రాంతాల్లోని కొన్ని బీచులలో ఇవి ఉంటాయి. 49 అడుగుల ఎత్తు వరకు ఈ చెట్లు పెరుగుతాయి. ఆకుపచ్చ, పసుపు రంగులో పూలు వస్తాయి.

దీనికి చిన్న కాయలు కాస్తాయి. ఈ కాయలను తింటే చాలా ప్రమాదం. ఇవి తినడానికి తీయగానే ఉంటాయి. తీపిగా ఉన్నాయి కదా అని తింటే మాత్రం ప్రాణాలు గాల్లోనే. ఈ చెట్టు వల్ల ఎలాంటి ఉపయోగాలు లేవు, కానీ ఒకే ఒక ప్రయోజనం మాత్రం ఉంది. ఇవి బీచ్ ఒడ్డున మాంగ్రూవ్ చెట్ల మధ్యలో పెరుగుతూ ఉంటాయి. ఇవి సముద్రం వల్ల నేల కోత పడకుండా అడ్డుకుంటాయి. ఇదే వాటి వల్ల కలిగే ఏకైక ప్రయోజనం.

అదృష్టం కొద్దీ ఈ చెట్లు కారణంగా ప్రపంచంలో ఒక్క ప్రాణమూ పోలేదు. ఈ చెట్లు ఉన్నచోట అమెరికా ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ చెట్లకు దగ్గరకు ఎవరు వెళ్ళకూడదు… అని బోర్డులు పెడుతుంది. అందుకే ఈ చెట్లు ఉన్నచోటికి ప్రజలు వెళ్లరు. చెట్లు ఇంత ప్రమాదకరమైనవని చెబుతున్న కూడా కరీబియాలోని ఒక ఫర్నిచర్ కంపెనీ మాత్రం ఫర్నిచర్ల తయారు చేసేందుకు ఈ చెట్లని ఉపయోగిస్తుంది. దానికోసం వారు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చెట్లు కొమ్మలను ఎండలో బాగా ఎండబెడుతున్నారు. ఆ లోపల ఉన్న తేమ, పాలు అన్నీ ఆవిరి అయిపోయాక దాంతో ఫర్నిచర్ తయారు చేస్తున్నారు. అయినా కూడా ఆ చెట్లను కొట్టే క్రమంలో పాపం చాలామంది అలర్జీ బారిన పడుతున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version