దేశ వ్యాప్తం గా ఓమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నసమయం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. అలాగే కరోనా వైరస్ థర్డ్ వేవ్ ను ఎదుర్కో వడానికి సిద్ధం అవుతుంది. మంగళ వారం తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు.. సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో థర్డ్ వేవ్ తో పాటు ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి గురించి అధికారులతో చర్చించారు. అలాగే పలు ఆదేశాలను జారీ చేశారు.
థర్డ్ వేవ్ ను ఎదుర్కోవడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. థర్డ్ వేవ్ కోసం రాష్ట్ర వ్యాప్తం గా 21 లక్షల హోం ఐసోలేషన్ కిట్ల ను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే 545 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను కూడా అందదు బాటు లో ఉంచాలని సూచించారు. దీంతో పాటు ప్రపంచ వ్యాప్తం గా కరోనా వైరస్ వ్యాప్తి ని అధ్యయనం చేయడానికి ఒక ప్రత్యేక కమిటీ ని నియమించాలని అధికారులకు సూచించారు. థర్డ్ వేవ్ వచ్చానా.. ఎదుర్కొవడానికి సిద్ధం గా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.