BREAKING : తెలంగాణలో బూస్టర్ ను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు..

-

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్‌ సర్కార్‌ అదిరిపోయే శుభవార్త చెప్పింది. నేటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో బూస్టర్ డోస్ ను అందించనుంది కేసీఆర్‌ సర్కార్. ఇందులో భాగంగానే.. కాసేపటి క్రితమే… బూస్టర్ ను ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మంత్రి హరీష్ రావు. హైదరాబాద్‌ లోని యునాని ఆస్పత్రిలో బూస్టర్ డోస్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.

60 ఏళ్ళు పైబడిన వాళ్లకు, హెల్త్ కేర్ వర్కర్లకు, ఫ్రoట్ లైన్ వర్కర్లకు ఈ బూస్టర్ డోస్ ను అందించనుంది.. మొదటి, రెండో డోస్ తీసుకున్న వాక్సిన్ నే మూడో డోస్ గా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వైద్య అధికారులు పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ… కరోనా మహమ్మారి నియంత్రణ కోసం మాస్క్, సానిటైజర్ లతో పాటూ వాక్సిన్ తీసుకోవాలని కోరారు. వాక్సిన్ పై అపోహలు నమ్మొద్దని.. అర్హులందరూ వాక్సిన్ తీసుకోవాలని తెలిపారు. యునాని ఆస్పత్రి చాలా పాతది అయిపోయింది… వర్షం పడితే ఇబ్బందిగా ఉందన్నారు. యునాని ఆస్పత్రిలోని సమస్యలను మంత్రి హరీష్‌ రావుకు వివరించానని ఆయన వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version