ప్రజలను మభ్యపెట్టాలని 42 పేజీల మెనిఫెస్టోను రుపొందించారు : హరీష్‌ రావు

-

కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టో 420 మెనిఫెస్టో అని మంత్రి హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ పథకాలను, మెనిఫెస్టోను కాఫీ కొట్టారని, కొన్ని అచరణ సాధ్యం కానీ హామీలతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారన్నారు. మాట తప్పని, మడమ తిప్పని కేసీఆర్ చెప్పాడంటే అమలు చేస్తాడనే నమ్మకం ప్రజలకు ఉందన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపుర్‌లో నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి హరీశ్ రావు హాజరై మాట్లాడారు. ఎలాగూ లెగిచేది లేదని అమలు సాధ్యం కానీ హామీలతో ప్రజలను మభ్యపెట్టాలని 42 పేజీల మెనిఫెస్టోను రుపొందించారని ఎద్దెవ చేశారు. జనం ఎక్కడ కొడతారో అనే భయంతో కాంగ్రెస్ నాయకులు 24 గంటల కరెంట్ ఇస్తామని మెనిఫెస్టోలో పెట్టారన్నారు. రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, గొర్రెల పంపిణీ ఇలా అందులో సగం బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పేరు మార్చి మెనిఫెస్టోలో ప్రకటించారన్నారు.

‘‘రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు భూమితో సంబంధం లేకుండా పేదలకు కూడా ఐదు లక్షల బీమా ఇవ్వడం జరుగుతుంది. పోయిన ఎన్నికల్లో బీజేపీకి ఒక సీటు వచ్చింది. ఈసారి ఒకటో రెండో వస్తాయి. కేసీఅర్‌పై బూతులు మాట్లాడే వాళ్లకు పోలింగ్ బూతులో బుద్ది చెప్పండి. కాంగ్రెస్‌కు ఓటేస్తే మూడు గంటల కరెంట్ కావాలో.. కేసీఅర్ కావాలో నిర్ణయించుకోండి. పది మొక్కులు మొక్కినా దేవుడే ఒకటో, రెండో తీరుస్తాడు. కానీ కేసీఅర్ మాత్రం పదికి తొమ్మిది తీర్చారు.’’ అని హరీశ్‌రావు చెప్పుకొచ్చారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version