పరకాలకు కోర్టు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం : కేసీఆర్‌

-

ధరణి తీసేస్తే పైరవీకారుల రాజ్యం వస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. ధరణితో రైతులకు భూములపై హక్కులున్నాయని చెప్పారు. ధరణితో 15 నిమిషాల్లో భూముల రిజిస్ట్రేషన్ అవుతుందని.. ధరణి తిసేస్తే రైతు బంధు ఎలా వస్తుందని కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ రైతుబంధు దుబారా అంటోందని విమర్శించారు. టీపీసీసీ చీఫ్ 3 గంటల కరెంట్ చాలంటున్నారని.. 30 లక్షల మోటార్లు ఎవరు మార్చాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే.. రైతుబంధు రూ. 10 వేల నుంచి రూ. 16 వేలకు పెంచుతామని కేసీఆర్ చెప్పారు. పరకాలకు కోర్టు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని తెలిపారు.

ధరణి స్థానంలో భూ భారతి తెస్తామని కాంగ్రెస్ వాళ్లు చెబుతున్నారని ఇది కొత్తదేమి కాదన్నారు. భూ భారతిని 30, 40 ఏళ్ల క్రితమే తీసుకువచ్చారని దీంతో ఎమ్మార్వోలు, తహశీల్దార్లు, దళారుల మళ్లీ పాత కథే ఉంటుందని హెచ్చరించారు. ధరణి తీసేస్తే రైతు మళ్లీ లంచాలు పెరుగుతాయన్నారు. ధరణితో ఎవరి భూములపై వారికే అధికారం ఉందని ఆ అధికారం ఉంచుకుంటారో వదులుకుంటారో మీ ఇష్టం అన్నారు. రైతులకు 24 గంటల కరెంట్ ఉండాలని చెబుతున్నది బీఆర్ఎస్ పార్టీ అయితే 3 గంటలే చాలు అంటున్నది కాంగ్రెస్ పార్టీ అని ఏ పార్టీ అధికారంలో ఉండాలో ప్రజలే నిర్ణయించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా రైతుబంధు ఇవ్వలేదు సరికదా మేమిస్తుండే అది వృథా అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని రైతు బంధు ఇవ్వాలా వద్దా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను నమ్మి కర్నాటక ప్రజలు మోసపోయారని, అక్కడ 5 గంటల కరెంట్ కూడా ఇవ్వని కాంగ్రెస్ నేతలు 24 గంటల కరెంట్ ఇస్తున్న తెలంగాణకు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ప్రజలు ఆలోచన చేయాలన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version