గుడ్ న్యూస్.. గాంధీ ఆస్పత్రిలో త్వరలో..?

-

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి గాంధీ ఆసుపత్రి లో కేవలం కరోనా వైరస్ బాధితులకు మాత్రమే వైద్యం అందిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన వారందరికీ గాంధీ ఆసుపత్రిలోనే చికిత్స అందించారు. దీంతో ఎంతో మంది గాంధీ ఆస్పత్రిలో సాధారణ వైద్య సేవలు అందక పోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై తెలంగాణ ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

గాంధీ ఆసుపత్రిలో త్వరలో కరోనా వైద్య సేవలతో పాటు సాధారణ వైద్య సేవలు కూడా ప్రారంభం అవుతాయి అంటూ తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ఇక సాధారణ వైద్య సేవలు ప్రారంభమైన నెల రోజుల వ్యవధిలోనే ఆపరేషన్లు చేయడం కూడా వైద్యులు మొదలు పెడతారని తెలిపారు పేదల. కరోనా వైరస్ ప్రాణాంతకమైన వైరస్ కాదు అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందునుంచి చెబుతూనే ఉంది అంటూ తెలిపిన ఈటెల.. కరోనా విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా ఉండాలి అంటూ సూచించారు. ఇక కరోనా వైరస్ బారిన పడినవారు ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లి అధిక ఫీజులు చెల్లించే బదులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం తీసుకోవాలి అని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version