కాంగ్రెస్‌ పై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి జగదీష్ రెడ్డి

-

బీబీనగర్ మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ఆత్మీయ సదస్సులో మంత్రి జగదీష్ రెడ్డి ప్రసంగిస్తూ, పార్టీ పటిష్టతకు గ్రామ సభలతో సమానంగా పార్టీ సమావేశాలు నిర్వహించగలిగినప్పుడు మాత్రమే జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం ప్రజల్లోకి వెళ్తాయని, అందుకే ఆత్మీయ సదస్సులు నిర్వహిస్తున్నామని, కేసీఆర్ సందేశం ప్రజల్లోకి చేరేలా గులాబీ శ్రేణులు పని చేయాలని వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా చెయ్యాలని అన్నారు ఆయన. గులాబీ జెండా అంటేనే విపక్షాల గుండెల్లో వణుకు వచ్చేలా ముందుకు సాగాలని అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. మాట్లాడారు. బీఆర్ఎస్ రూపంలో మోడీ అండ్ గ్యాంగ్ కు భయం పట్టుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందన్నారు ఆయన .

రాహుల్ గాంధీ తో ఏమి కాదనుకుంటున్న తరుణంలో అవిర్బావించిన బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కి మింగుడు పడడం లేదన్నారు. అందుకే ఎమ్మెల్సీ కవిత పై కేసుల బనాయింపు, కేటీఆర్ పై విమర్శలు వెరసి సీఎం కేసీఆర్ ఆత్మస్థైర్యం దెబ్బతీసే కుట్రలకు బీజేపీ తెర లేపిందని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధి,సంక్షేమ పథకాల సెగ గుజరాత్ కు తగలడంతో బీజేపీ పాలిత రాష్ట్రాలలో తిరుగుబాటు వస్తుందన్న భయంతో వణికి పోతున్నారన్నారు.విద్యుత్ ను వినియోగిస్తున్న వినియోగదారుల పై 20 శాతం అదనంగా చార్జీలు పెంచాలంటూ మోడీ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వానికి తాఖీదులు పంపారన్నారు. ఇప్పటికే ట్రూ-అప్ చార్జీల పేరుతో వినియోగదారుల నుండి 12,000 కోట్లు వసూలు చేయాలంటూ ఈ ఆర్ సీ సిఫార్సు చేసిందని,ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందంటూ కేసీఆర్ స్పష్టం చేశారన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. సామాన్యుడికి భారంగా మారనున్న కేంద్రం తాఖీదులను ఎందుకు పట్టించుకుంటుందంటూ నిలదీశారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణా రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి, జడ్పీటీసీ గోలి ప్రణీత పింగళి రెడ్డి, ఎంపీపీ సుధాకర్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ రెడ్డి ,రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ బొక్క జైపాల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఆర్.శ్రీనివాస్, సర్పంచ్ భాగ్యలక్ష్మి శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version