ప్ర‌భుత్వం కేటాయించిన బంగ‌ళాను ఖాళీ చేయాలి : రాహుల్‌కు నోటీసులు

-

అన‌ర్హ‌త వేటు నేప‌ధ్యంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై ఢిల్లీలోని లూటెన్స్ అధికారిక నివాసాన్ని ఏప్రిల్ 22లోగా ఖాళీ చేయాల‌ని అధికారులు రాహుల్ గాంధీకి తెలిపారు. ప్ర‌భుత్వం కేటాయించిన బంగ‌ళాను ఖాళీ చేయాల‌ని కోరుతూ రాహుల్ గాంధీకి లోక్‌స‌భ హౌసింగ్ క‌మిటీ ఈరోజు ఆయనకు నోటీసులు అందచేశారు. 2004లో రాహుల్ ఎంపీగా ఎన్నికైన అనంత‌రం ఆయ‌న‌కు 12 తుగ్ల‌క్ లేన్ బంగ‌ళాను కేటాయించడం జరిగింది. 2019లో దాఖ‌లైన ప‌రువు న‌ష్టం కేసులో రాహుల్‌కు సూర‌త్ కోర్టు రెండేండ్ల జైలు శిక్ష విధించ‌డంతో ఎంపీగా రాహుల్ గాంధీపై లోక్‌స‌భ సెక్ర‌టేరియ‌ట్ అన‌ర్హ‌త వేటు వేయడం జరిగింది. ఈ కేసులో రాహుల్‌కు సూర‌త్ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పుపై 30 రోజుల్లోగా ఎగువ కోర్టును ఆశ్ర‌యించేందుకు అనుమ‌తి ఇవ్వడం జరిగింది.

ఇక ఎగువ కోర్టులో రాహుల్ నిర్ధోషిత్వం రుజువై, శిక్ష‌ను నిలిపివేయ‌ని ప‌క్షంలో ఆయ‌న ఎనిమిదేండ్ల పాటు ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవ‌కాశం కూడా కోల్పోతారు. ఇక నిబంధ‌న‌ల ప్ర‌కారం అన‌ర్హ‌త ఉత్త‌ర్వులు జారీ చేసిన‌ప్ప‌టి నుంచి నెల‌రోజుల్లోగా రాహుల్ త‌న అధికారిక నివాసాన్నికూడా వదిలి వెళ్లాల్సి ఉంటుంది. రాహుల్‌ గాంధీ కి సూర‌త్ కోర్టు విధించిన శిక్ష‌తో పాటు అన‌ర్హ‌త వేటుపై న్యాయ‌ప‌రంగా, రాజ‌కీయంగా పోరాటం చేప‌డ‌తామ‌ని తెలిపింది కాంగ్రెస్ . అదానీతో మోదీకి ఉన్న బంధాన్ని పార్ల‌మెంట్‌లో ప్ర‌శ్నించినందుకే రాహుల్‌పై అన‌ర్హ‌త వేటు వేశార‌ని కాంగ్రెస్ స‌హా విప‌క్షాలు మోదీ స‌ర్కార్‌పై తమ ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version