కీల‌క అంశాల‌పై పార్టీ నేత‌ల‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు : మంత్రి జగదీష్ రెడ్డి

-

తెలంగాణ‌లో ద‌శాబ్ద కాలంలోనే శ‌తాబ్ద కాలంలో చేయాల్సిన ప‌నులను బీఆర్ఎస్ ప్ర‌భుత్వం చేసి చూపించింద‌ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన బీఆర్ఎస్ శాస‌న‌స‌భాప‌క్ష‌, పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం ముగిసిన అనంత‌రం మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ద‌శాబ్ది ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌తో పాటు ప‌లు కీల‌క అంశాల‌పై పార్టీ నేత‌ల‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేసిన‌ట్లు మంత్రి పేర్కొన్నారు.

దేశంలో ఏ పార్టీ చేయని అద్భుతాలు, విజయాలను ఈ తొమ్మిదేళ్ల కాలంలోనే బీఆర్ఎస్ సాధించిందని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కేంద్ర మంత్రులతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రశంసలు కురిపించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ, పార్టీ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతను కేసీఆర్ వివరించినట్లు మంత్రి చెప్పారు. విద్యుత్ రంగంలో గుజరాత్ రాష్ట్రంలో ఇప్పటికీ కోతలు ఉన్నాయి. కానీ దేశంలోనే తొలి సారిగా వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్ర తెలంగాణ మాత్రమే అని మంత్రి చెప్పారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version