గులాబీ శ్రేణుల త్యాగాలు, ఉద్యమ నేత కేసీఆర్‌ పట్టుదలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది : జగదీశ్ రెడ్డి

-

ఈరోజు సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వేంల మండలం బీబీగూడెంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్లఓట్లు పాల్గొన్నారు. అక్కడ మంత్రి ప్రసంగిస్తూ, ఓట్లు అడిగే దమ్ము ధైర్యం రాష్ట్రంలో ఒక్క బీఆర్‌ఎస్‌ పార్టీకీ మాత్రమే ఉందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్నేతృత్వంలో అటు అభివృద్ధి ఇటు సంక్షేమం పరుగులు పెట్టడమే గులాబీ శ్రేణులకు ఆ స్థైర్యాన్ని ఇచ్చిందని తెలియచేసారు ఆయన. మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ గులాబీ శ్రేణుల త్యాగాలు, ఉద్యమ నేత కేసీఆర్‌ పట్టుదలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని తేల్చి చెప్పారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి బలం, బలగం గులాబీ సైన్యమేనని స్పష్టం చేశారు ఆయన . ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలు గులాబీ శ్రేణుల భరోసా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్నారని తెలియచేశారు మంత్రి జగదీష్ రెడ్డి. ప్రభుత్వం పారదర్శకతతో పనిచేస్తుందని అన్నారు. లబ్ధిదారుల ఖాతాలలో నేరుగా నిధులు జమ కావడమే ఇందుకు నిదర్శనమని వెల్లడించారు.

2014 సంవత్సరానికి ముందు సాగిన పాలనలో ప్రభుత్వ నిధులు మధ్యదళారుల జేబుల్లోకి నిధులు చేరుకున్నాయి అని హేళన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నీడను చూస్తేనే కేంద్రానికి వణుకు పుడుతుందన్నారు. మోదీ పాలనలో దేశంలో దారిద్య్రం నానాటికి పెరిగి పోతుందని స్పష్టం చేశారు ఆయన. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలకు దేశవ్యాప్తంగా డిమాండ్ పెరిగిందన్నారు.దీంతో కమల నాథులు బెంబేలెత్తిపోతున్నారని మండిపడ్డారు మంత్రి జగదీష్ రెడ్డి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version