బదిలీలు, పదోన్నతుల్లో అక్రమాలకు పాల్పడినవారిపై చర్యలు..!

-

బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ముగిసి 80 రోజులు గడుస్తున్నా అప్పీల్స్ ను పరిష్కరించకపోవడాన్ని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నిరసిస్తున్నది. వెబ్ కౌన్సెలింగ్ పద్దతిలో ప్రక్రియ పారదర్శకంగా జరిగినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాలు, అధికారుల తప్పిదాలు, సమయాభావం, అవగాహనా లోపం వలన నష్టపోయిన ఉపాధ్యాయులకు విద్యాశాఖే అప్పీల్స్ కు వారం రోజులు గడువు ఇచ్చింది. ఆ మేరకు కొందరు ఉపాధ్యాయులు తమకు నష్టం జరిగిందని అప్పీల్ చేసుకున్నారు. రెండువారాల్లో అప్పీల్స్ పరిష్కారం చేస్తామని జిఓలో పేర్కొన్నారు కానీ ఎనబైరోజులు గడిచినా అప్పీల్స్ పరిష్కారం కాకపోవడం చేత ఆ ఉపాధ్యాయులు నిత్యం డైరెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు.

పాత స్టేషన్లో రిలీవై కొత్త స్టేషన్లో చేరకుండా కొందరు, రిలీవ్ కాకుండా కొందరు, కొత్త స్టేషన్లో జాయిన్ అయి మరికొందరు తమ అప్పీల్ పరిష్కారం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ ఉపాధ్యాయుల అప్పీల్స్ ను పరిశీలించి పరిష్కరించాల్సిన బాధ్యత విద్యాశాఖపై ఉన్నది. కనుక వెంటనే అప్పీల్స్ అన్నింటినీ సానుకూలంగా పరిష్కరించాలని యుయస్పిసి స్టీరింగ్ కమిటీ డిమాండ్ చేసింది. అదేవిధంగా బదిలీలు, పదోన్నతుల్లో అక్రమాలకు పాల్పడినవారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని యుయస్పిసి డిమాండ్ చేసింది..

Read more RELATED
Recommended to you

Exit mobile version