పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో చాలా పెద్ద మార్పు వస్తుంది. పెళ్లి తర్వాత భార్య భర్త ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా అవసరం. కొత్తగా పెళ్లయిన జంటలు బంధాన్ని బలపరచుకోవడానికి ఇలా చేయాలి. రిలేషన్ దృఢంగా ఉండడానికి కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. ఎప్పుడు కూడా ఓపెన్ గా ఒకరితో ఒకరు మాట్లాడడం చాలా అవసరం. ఐ కాంటాక్ట్ ఇస్తూ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పేయాలి. అలాగే ఒకరితో ఒకరు ఎక్కువ సమయాన్ని గడిపేలా చూసుకోవాలి. సినిమాకు వెళ్లడం లేదంటే డిన్నర్ చేయడం ఇలాంటివి చేస్తే ఎక్కువ సమయం ఒకరితో ఒకరు గడపడానికి అవుతుంది.
ఇద్దరికీ ఫ్రీ టైం దొరికినప్పుడు ఇలాంటివి చేయండి. ప్రేమ కూడా ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పార్ట్నర్ చెప్పేది ఓపికగా వినాలి. అలాగే పార్ట్నర్ గురించి అర్థం చేసుకోవడం కూడా చాలా అవసరం. మీ పార్ట్నర్ గెలుపుని అభినందించడం ఓడిపోతే ప్రోత్సహించడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వలన ప్రేమ పెరుగుతుంది. బంధం ఎంతో దృఢంగా మారుతుంది.
భవిష్యత్తును మీరిద్దరూ కలిసి నిర్మించుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి ప్రతి విషయాన్ని ఇద్దరు మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రావాలి. భార్యాభర్తల మధ్య బంధం బావుండడానికి సర్ప్రైజ్లు కూడా చాలా అవసరం. చిన్న చిన్న బహుమతులు ఇవ్వడం వలన ప్రేమ పెరుగుతుంది. సంతోషంగా ఉండడానికి అవుతుంది. ఇద్దరు మధ్య సెట్ అవ్వట్లేదు అని అనిపిస్తే మ్యారేజ్ కౌన్సిలింగ్ తీసుకోవడం మంచిది. కౌన్సిలర్ తీసుకుంటే పరిష్కారం దొరుకుతుంది. ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సమయాన్ని ఇస్తూ ఉంటే కచ్చితంగా ప్రేమ పెరుగుతుంది. ఒకరికొకరు సహాయం చేసుకోవడం ఒకరికొకరు తోడుగా ఉండడం అలవాటు చేసుకోండి. ఎప్పుడూ హ్యాపీగా ఉండొచ్చు వైవాహిక జీవితంలో ఇబ్బందులే ఉండవు.