మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని జాతీయ అవార్డు

-

టాలీవుడ్ సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఏఎన్నార్ శతజయంతి వేడుకలు ఆర్.కే.సినీ ప్లెక్సీలో జరుగుతున్నాయి. ఇవాళ ఆయన జయంతి సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని జాతీయ అవార్డును ప్రకటించారు. జాతీయ అవార్డుల వేడుకకు ముఖ్య అతిథిగా బాలీవుడ్ సీనియర్ హీరో అమితాబచ్చన్ హాజరు కానున్నారు. అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులతో పాటు దర్శకుడు డాక్టర్ కే.రాఘవేంద్రరావు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా హీరో నాగార్జున మాట్లాడుతూ నాన్న గారు మాకు నవ్వుతూ జీవించడం నేర్పించారు. అన్నపూర్ణ స్టూడియోలో అభిమానులు రక్తదానం చేశారు. నాన్న పై అభిమానులు చూపించిన ఆదరణ మా కుటుంబం ఎప్పుడూ మరిచిపోదు అన్నారు. రెండేల్లకొకసారి ఏఎన్నార్ అవార్డులను అందజేస్తున్నాం. ఈ ఏడాది హీరో చిరంజీవి గారికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అక్టోబర్ 28న ఏఎన్నార్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం ఉంటుందని తెలిపారు నాగార్జున. 

Read more RELATED
Recommended to you

Exit mobile version