Breaking : చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లకు మంత్రి జోగి రమేశ్‌ సవాల్‌

-

మరోసారి జనసేన, టీడీపీ పార్టీలప విమర్శలు గుప్పించారు గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్. తాజాగా ఆయన తాడేపల్లిలో
మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో ఒక్క పేదవారికి అయినా ఇళ్ళ స్థలం ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఇవాళ 30 లక్షల మంది మహిళలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఇళ్ళ నిర్మాణం చేస్తూ ఉంటే ఎందుకు అంత కడుపు మంట?? అని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. ‘కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలతో అభూత కల్పనలు చేస్తున్నారు. ఇప్పటం గ్రామంలో ఒక్క ఇంటిని కూడా కూల్చలేదు. రోడ్డు విస్తరణకు అడ్డు వచ్చిన ప్రహరీ గోడలను మాత్రమే తొలగించారు. అది కూడా ప్రభుత్వ స్థలంలో కట్టిన ప్రహరీ గోడలు.

సొంత పుత్రుడు ఓడిపోయిన మంగళగిరి నియోజకవర్గానికి రెండు చోట్ల ఓడిపోయిన దత్త పుత్రుడుని తీసుకుని వచ్చి ప్రచారం చేయిస్తున్నాడు పవన్ కళ్యాణ్ విలనిజం, హీరోయిజం ప్రజాస్వామ్యంలో పనికి రాదు. మీసాలు తిప్పటాలు, తొడలు కొట్టడాలు చూసి ప్రజలు. అసహ్యించుకుంటున్నారు. జగనన్న కాలనీల్లో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాదు. డైరెక్ట్ గా లబ్దిదారుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. దమ్ముంటే జనసేన, టీడీపీ ప్లేస్, టైం చెప్పండి ‌‌… నేను వస్తా. ఏ జగనన్న కాలనీకు రమ్మంటే అక్కడికి వస్తా. చంద్రబాబు, ఆయన తొత్తు పవన్ కళ్యాణ్… ఇద్దరికీ నా ఛాలెంజ్’ అని మంత్రి జోగి రమేశ్‌ సవాల్‌ విసిరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version