పవన్ తోపాటు, లోకేష్ కి కూడా వ్యవసాయంపై పరిజ్ఞానం లేదు : మంత్రి కాకాణి

-

ఏపీలో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది. ఎన్నికలకు ఇంకా సంవత్సర కాలం సమయం ఉన్నా.. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ పార్టీలు వ్యూహాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు విమర్శలకు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. అయితే.. పవన్ కల్యాణ్ ఈనెల 20న కడప జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్రను ప్రారంభించబోతున్నారు. ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట నియోజకవర్గంలో కౌలు రైతుల కుటుంబాలకు ఆయన ఆర్థిక సాయం చేయబోతున్నారు. ఈమేరకు ఆయన పర్యటన ఖరారైంది. అయితే ఈ పర్యటనకు కౌంటర్ గా ఇప్పటినుంచే వైసీపీ నేతలు సెటైర్లు పేలుస్తున్నారు. కౌలు రైతు భరోసా యాత్రల పేరుతో పవన్ కల్యాణ్ వ్యవసాయం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. పవన్ తోపాటు, లోకేష్ కి కూడా వ్యవసాయంపై పరిజ్ఞానం లేదన్నారు. నెల్లూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కాకాణి.. పవన్, లోకేష్ పై సెటైర్లు పేల్చారు. రాష్ట్రంలో పండే 10 పంటల్ని పవన్ కల్యాణ్, లోకేష్ కి చూపిస్తామని.. ఆ పది పంటల్లో కనీసం ఐదింటిని గుర్తు పట్టడం వారికి సాధ్యం కాదని మంత్రి కాకాణి ఎద్దేవా చేశారు.

గతంలో కూడా తాను ఈ సవాల్ విసిరానని.. మరోసారి అదే మాట చెబుతున్నానని అన్నారు మంత్రి కాకాణి. పవన్ కల్యాణ్, లోకేష్ ముందు పంటల గురించి అవగాహన పెంచుకోవాలని, ఆ తర్వాతే వ్యసాయం గురించి మాట్లాడాలన్నారు మంత్రి కాకాణి. ముందు వ్యవసాయం గురించి పవన్, లోకేష్ తెలుసుకోవాలన్నారు మంత్రి కాకాణి. వ్యవసాయం గురించి మాట్లాడటాన్ని తానుతప్పుబట్టడం లేదని, కానీ విషయావగాహన లేకుండా విమర్శలు చేయడం సరికాదన్నారు మంత్రి కాకాణి. కనీసం 10 పంటలను చూపిస్తే, అందులో ఐదింటిని పవన్, లోకేష్ గుర్తుపట్టలేని ఎద్దేవా చేశారు కాకాణి. గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్మించిన నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో వర్చువల్ విధానంలో పాల్గొన్నారు మంత్రి కాకాణి. నెల్లూరులోని అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ నుండి ఈ కార్యక్రమం నిర్వహించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version