చిట్ చాట్ లో స్థానిక సంస్థల ఎన్నికలపై క్లారిటీ ఇచ్చారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. సెప్టెంబర్ 10 తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి అని చిట్ చాట్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.

ఇది ఇలా ఉండగా ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల అయింది. సెప్టెంబరు 10వ తేదీ నాటికి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓటర్ల, పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రచురించాలని ఆదేశిస్తూ కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది ఎన్నికల సంఘం. సెప్టెంబరు 6న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల వారీగా ఓటర్ల, పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాలు ప్రచురించాలని ఆదేశించారు.