సచివాలయంలో హ్యామ్ రోడ్లపై ఆర్ & బీ అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో హైబ్రీడ్ అన్యూటీ మోడ్ రోడ్ల నిర్మాణంలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించిన మంత్రి.. నియమ, నిబంధనలకు అనుగుణంగా హ్యామ్ రోడ్ల నిర్మాణం చేయాలని అధికారులకు సూచించారు. మండలం నుంచి జిల్లా కేంద్రానికి మిస్సింగ్ లింక్ రోడ్లు, జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి మిస్సింగ్ లింక్ రోడ్ల, అప్ గ్రేడేషన్ వంటి మూడు విభాగాలుగా నిర్మాణంలో కన్సల్టెంట్లను గుర్తించి, డీపీఆర్ సిద్ధం చేయాలని ఆదేశం ఇచ్చారు.
మంచిగా ఉన్న రోడ్లను హ్యామ్ లోకి తీసుకువస్తే కన్సల్టెంట్లే బాగుపడుతరు కాబట్టి, అధికారులు హ్యామ్ రోడ్లను గుర్తించే క్రమంలో.. అత్యంత దారుణంగా ఉండి, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న రోడ్లకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని దిశానిర్ధేశం చేసారు. రోడ్ల నిర్మాణంలో డివైడర్లు, లైంటింగ్, రోడ్డు విస్తరణ, పేవ్ డ్ షోల్డర్స్ ఏర్పాటులో ప్రభుత్వ గైడ్ లైన్స్ పాటించేలా పకడ్భందీగా వ్యవహరించాలని తేల్చిచెప్పిన మంత్రి.. 15 ఏండ్ల పాటు హ్యామ్ రోడ్డు తీసుకున్న సంస్థే పూర్తిగా మొయింటినెన్స్ చేయాల్సి ఉన్నందున రోడ్డు నాణ్యతలో రాజీపడకుండా ఉండేలే ప్రతీ ఇంజనీర్ జాగ్రత్తగా పనులను తనిఖీ చేయాలని సూచించారు. ఇప్పటి వరకు మట్టి రోడ్డుగా ఉన్న రోడ్లను గుర్తిస్తే.. తన దృష్టికి తీసుకువస్తే వెంటనే మంజూరీ చేస్తానని అధికారులకు చెప్పిన ఇచ్చిన మంత్రి.. అటవీ అనుమతులతో మట్టిరోడ్లుగా ఉన్న రహదారులను భవిష్యత్తులో బీటీగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు మంత్రి.