శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి రాములోరి సన్నిధానం భక్త జనసందోహం నడుమ కనువిందు చేస్తున్నది. స్వామి వారి కళ్యాణం వీక్షించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆలయానికి చేరుకున్నారు. కోదండ రాముడి పుట్టినరోజు సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు, అర్చన వంటి కార్యాలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణానికి రాష్ట్ర దేవదాయ శాఖ తరపున మంత్రి కొండా సురేఖ, సీఎస్ శాంతి కుమారి, దేవాదాయ శాఖ చీఫ్ సెక్రెటరీ శైలజా రామయ్యర్ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఇందుకోసం మంత్రి కొండా సురేఖ తన తలపై స్వామి వారి పట్టువస్త్రాలు తీసుకుని రావడం గమనార్హం. మంత్రికి ఆలయ అర్చకులు ప్రత్యేక స్వాగతం పలికారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణానికి రాష్ట్ర దేవదాయ శాఖ తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన మంత్రి కొండా సురేఖ, సీఎస్ శాంతి కుమారి, దేవాదాయ శాఖ శాఖ చీఫ్ సెక్రటరీ శైలజా రామయ్యర్ pic.twitter.com/VMZUxzgSK2
— BIG TV Breaking News (@bigtvtelugu) April 6, 2025