హైద‌రాబాద్ ఒక అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించాలి : మంత్రి కేటీఆర్‌

-

ఫ‌తుల్లగూడా – పీర్జాదీగూడ బ్రిడ్జికి రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. మూసీ, ఈసీపై రూ. 545 కోట్లతో 14 బ్రిడ్జిలు నిర్మిస్తున్నామ‌ని తెలిపారు. హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిన న‌దిగా మూసీ న‌ది ఉండేద‌ని గుర్తు చేశారు మంత్రి కేటీఆర్. గ‌త ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో మూసీ న‌ది మురికి కూపంగా మారింది.

మూసీ సుంద‌రీక‌ర‌ణ ప‌నులు కొన‌సాగుతున్నాయని, అబ‌ర్ చివ‌రి నాటికి నీటి శుద్దీక‌ర‌ణ ప‌నులు పూర్త‌వుతాయ‌న్నారు మంత్రి కేటీఆర్. మూసీ, ఈసీపై రూ. 545 కోట్ల‌తో 14 బ్రిడ్జిల‌కు శంకుస్థాప‌న చేసుకుంటున్నామ‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. నిధులు పెరిగినా ప‌ర‌వాలేదు.. హైద‌రాబాద్ ఒక అద్భుత దృశ్యాన్ని ఆవిష్క‌రించాలి. శాశ్వతంగా, దీర్ఘ‌కాలికంగా ఉండేలా బ్రిడ్జిల నిర్మాణం చేప‌డుతామ‌న్నారు మంత్రి కేటీఆర్. 2000 మిలియ‌న్ లీట‌ర్స్ ఫ‌ర్ డే కెపాసిటీతో ఎస్టీపీల నిర్మాణం చేస్తున్నాం.

దుర్గం చెరువు వ‌ద్ద 7 ఎంఎల్‌డీ కెపాసిటీ ఎస్టీపీని నిర్మించాం. ఎస్టీపీలు పూర్త‌యితే మూసీలోకి పూర్తి స్థాయి శుద్ధి చేసిన నీటిని వ‌దిలే ప‌రిస్థితి. మంచిరేవుల – ఘ‌ట్‌కేస‌ర్ వ‌ర‌కు మూసీ న‌దిని అద్భుతంగా సుంద‌రీక‌రించాల‌న్న సీఎం క‌ల‌ను నెర‌వేరుస్తాం. ఒక్కొక్క‌టిగా సీవ‌రేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లు పూర్తి చేసి బ్రిడ్జిలు క‌డుతున్నాం. 160 కిలోమీట‌ర్ల ఓఆర్ఆర్ చుట్టూ తిర‌గ‌కుండా మ‌ధ్య‌లో మూసీ న‌ది మీదుగా వెళ్లే విధంగా బ్రిడ్జిలు నిర్మిస్తాం. రూ. 5 వేల కోట్ల‌తో రెండో విడుత ఎస్ఎన్‌డీపీ తొంద‌ర‌లోనే చేప‌డుతాం. జీవో 118లోని చిన్న చిన్న టెక్నిక‌ల్ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాం అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version