మూతి మీద తన్నినట్లు ఆన్సర్ ఇవ్వండి: కేటీఆర్

-

ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారికి మూతి మీద తన్నినట్లు సమాధానం ఇవ్వాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం తెలంగాణభవన్లో బీఆర్ ఎస్వీ యూత్ వింగ్ తో ఆయన సమావేశం అయ్యారు. ప్రత్యర్థులు ఏ సోషల్ మీడియాలో అయితే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో.. అక్కడే వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు సృష్టించే వారికి బుద్ధి చెప్పాలన్నారు. ప్రభుత్వం చేసే మంచిని ప్రజలకు తెలియజేయాలంటూ కేటీఆర్ సూచించారు.

కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి అక్కడి రైతులకు కరెంటు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణకు వచ్చి కన్నడ రైతులు కాంగ్రెస్ పార్టీకి వ్యతరేకంగా ఆందోళనలు చేస్తున్నారని గుర్తు చేశారు. కేసీఆర్ తెలంగాణ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తుంటే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కేవలం 5 గంటల కరెంటు మాత్రమే ఇస్తామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారం చేపట్టిన కొన్ని నెలలకే రియల్ ఎస్టేట్ రంగం ఆగం అయిందన్నారు. బెంగళూరులో చదరపు అడుగుకు రూ.500 ఎక్కువ వసూలు చేస్తుంటే తెలంగాణలో టీఎస్బీపాస్ తో లంచాలు లేకుండా భవన నిర్మాణం అనుమతులు వస్తాయని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని చూసి రజినీ కాంత్, సన్నీ డియోల్ ఆశ్చర్యపోయారని కేటీఆర్ తెలిపారు. నగరంలో నలువైపులా టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ అభివృద్ధి చేస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. మలక్ పెట్ ఐటీ టవర్ పూర్తి అయితే 25 వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version