ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో ఇంపార్టెంట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య సురక్ష ను మొదలు పెట్టిన ప్రభుత్వం.. ఈ కార్యక్రమం ఏ విధంగా జరుగుతోందా ? అసలు స్పందన ఎలా ఉందన్న విషయాలను తెలుసుకోవడానికి ప్రతి వారం సమీక్ష పెట్టనున్నారట. ఇందులో భాగంగా హెల్త్ క్యాంపు లలో అన్ని సదుపాయాలు సరిగా ఉండాలని సంబంధిత అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఎవరైనా రోగులకు ఆరోగ్య హాస్పిటల్స్ కు డాక్టర్స్ రిఫర్ చేస్తే అందుకు సంబంధించినా పోను రావడానికి అయ్యే రవాణా ఖర్చులు కూడా ఇవ్వాలంటూ అధికారులను సూచించారు జగన్. ఇంకా దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారికి మందులను ఉచితంగా అందించాలని ఆదేశించారు.
ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఏ లోపం జరిగినా సహించేది లేదని గట్టిగా అధికారులను ఆదేశించారు జగన్. ఇక ఇప్పటి వరకు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 5126 హెల్త్ క్యాంపు లను నివ్రహించినట్లు రికార్డులో ఉంది.