కేంద్రం నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేసిన కేటీఆర్‌

-

కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ పురస్కారం తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మిషన్ భగీరథ’ పథకానికి లభించింది. ఈ పథకం నాణ్యత, పరిమాణం విషయంలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేంద్రం తెలిపింది. అన్ని గ్రామాల్లో ఇంటింటికీ నల్లా కనెక్షన్ల ద్వారా నాణ్యమైన నీటిని అందిస్తున్నట్టు గుర్తించి, అవార్డుకు ఎంపిక చేశామని చెప్పింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి లేఖను పంపించింది. అక్టోబర్ 2న జరిగే కార్యక్రమంలో అవార్డును అందుకోవాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆహ్వానించింది.

ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని గ్రామీణ ఆవాసాలకు తమ ప్రభుత్వం సురక్షిత తాగునీరు సరఫరా చేస్తున్న విషయాన్ని కేంద్రం గుర్తించడంపై ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. అయితే ఇదే సమయంలో మిషన్ భగీరథకు రూ. 19 వేల కోట్లు ఇవ్వాలన్న నీతి ఆయోగ్ సిఫారసులను కూడా కేంద్ర ప్రభుత్వం గౌరవిస్తే బాగుంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version