ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీకి తెలంగాణ అడ్డాగా మారాలే : మంత్రి కేటీఆర్‌

-

నేడు జహీరాబాద్‌లోని మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలో ఎలక్ట్రిక్ వెహికిల్ తయారీ యూనిట్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్ రావుతో పాటు పలువురు నాయకులు, కంపెనీ అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ మొబిలిటీ వాలీ ద్వారా ఎలక్ట్రిక్ తయారీ పరిశ్రమల కోసం ప్రణాళికబద్దంగా ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఆర్టీసీలో, ప్రైవేట్ వెహికల్స్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీకి తెలంగాణ అడ్డాగా మారాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని చెప్పారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీకి సంబంధించిన అన్ని రకాల పార్ట్‌లు తయారయ్యే విధంగా ప్రణాళిక రూపొందించామని తెలిపారు.

హైదరాబాద్‌లో ఫిబ్రవరిలో జరిగిన తెలంగాణ మొబిలిటీ వాలీ ద్వారా ఎలక్ట్రిక్ తయారీ పరిశ్రమల కోసం ఒప్పందాలు చేసుకున్నామని కేటీఆర్ గుర్తు చేశారు. కాగా, మహీంద్రా అండ్ మహీంద్రా వారు తెలంగాణ ప్రభుత్వ ఎలక్ట్రిక్ పాలసీ నచ్చి రూ. 1000 కోట్ల పెట్టుబడి జహీరాబాద్‌లో పెట్టడం సంతోషంగా ఉందన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమ స్థాపనకు కావాల్సిన అన్ని అనుమతులను 21 రోజుల్లో ఇస్తున్నామని తెలిపారు. టీఎస్ ఐపాస్ పాలసీ దేశానికి ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ వచ్చిన తర్వాత 23 వేల పరిశ్రమలు నెలకొల్పాము. మూడు లక్షల 30 వేల పెట్టుబడులు వచ్చాయి. 20లక్షల మందికి ఉపాధి అవకశాలు లభించాయని తెలిపారు. కొత్తగా వచ్చే కంపెనీలలో స్థానిక యువతకు పెద్దపీట వేసి ఉద్యోగాలు ఇస్తామన్నారు. జహీరాబాద్ ప్రాంతంలోని స్థానిక యువత కోసం ప్రభుత్వ పరంగా స్కిల్ డెవలప్‌మెంట్‌ సెంటర్ ఏర్పాటు చేస్తాము. ఉద్యోగాలు రావాలంటే యువత స్కిల్ పెంచుకోవాలని కేటీఆర్ వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version