Breaking : నాంపల్లి కోర్టుకు షర్మిల… వైద్య పరీక్షలు పూర్తి

-

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు ఊహించని షాక్ తగిలింది. ఆమెను జూబ్లీహిల్స్ స్టేషన్ నుంచి బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విధుల్లో ఉన్న పోలీసులపై దాడి చేసి కారుతో ఢీకొట్టిన కేసులో ఆమెను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఎస్సై రవీంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొత్తం 4 సెక్షన్లు 332, 353, 509, 427 కింద కేసు నమోదు చేశారు. అలాగే షర్మిల కారుతో ఢీకొట్టడంతో కానిస్టేబుల్ కు గాయాలు అయినట్లు సమాచారం.

దీనిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు. షర్మిలకు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అనంతరం షర్మిలను నాంపల్లి కోర్టుకు తరలించారు. తనను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలంటూ షర్మిల డిమాండ్ చేశారు. పర్సనల్ పనులకు తనని బయటకు వెళ్లనివ్వరా అని షర్మిల ప్రశ్నించారు. షర్మిలతో తన గన్ మెన్ ను కూడా వెళ్లకుండా పోలీసులు ఆపేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని.. పోలీసులు కేసీఆర్ కోసమే పనిచేస్తున్నారని షర్మిల ఆరోపించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version