రేపు నల్గొండలో పర్యటించనున్న కేటీఆర్‌.. వివరాలు ఇవే..

-

ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేపు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పర్యటించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో రూ.50 కోట్లతో జరిగే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. నాగార్జునసాగర్ లోని బుద్ధవనం, హైదరాబాద్ మహానగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు పెద్దవూర మండలం సుంకిశాలలో పంప్ హౌస్ ఏర్పాట్లను పరిశీలించనున్నారు మంత్రి కేటీఆర్‌. అనంతరం హాలియాలో నిర్వహించే బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు.

కేటీఆర్‌ టూర్ ఏర్పాట్లను జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే నోముల భగత్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అధికారులు పరిశీలించారు. అయితే.. నాగార్జున సాగర్‌లోని నిర్మించిన బుద్ధ భవన్‌ ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వం నిధులు జారీ చేసిందని.. అయినప్పటికీ కేంద్రమంత్రి హోదాలోనైనా నన్ను ఆహ్వానించలేదని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ట్విట్టర్‌లో ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version